శ్రీ విద్యారణ్యప్రోక్త బీజమంత్ర సంపుటిత శ్రీ సూక్త పారయణము
- ND.Sharma
- Jun 9, 2018
- 1 min read

శ్రీ పద్మాక్షిశరణంప్రపద్యే
శ్లో॥ పద్మాననే పద్మఊరు పద్మాక్షీ పద్మసంభవే| త్వమ్మాం భజస్వ పద్మాక్షీ యేన సౌఖ్యం లభామ్యహం ॥
పద్మం వంటి ఊరువులు ముఖం నేత్రములు కలిగిన ఆ తల్లిని పద్మాక్షీ అమ్మవారిని సేవిస్తే మనకు ఏదీ సుఖములను కలుగజేయునో అవి తప్పక దొరకగలవు. యథాయోగ్యం తథా కురు శ్రీ హనుమద్గిరిపద్మాక్షి అమ్మ చూపులతో ఈ జగత్తును రక్షిస్తూ సిరి సంపదలనిస్తూ ఉన్న పద్మాక్షీ అమ్మవారి పాద పద్మములకు నమస్కరిస్తూ 10-6-2018 ఆదివారం రోజున ఉ:9-30 నుండి 11:30 వరకు అధిక జ్యేష్ఠ(పురుషోత్త)మమాసం ,ఏకాదశి తిథి, అశ్విని నక్షత్ర మహాపర్వదినం సందర్భంగా 108 (కమలపుష్పాలు) లేదా వివిధ రకాల పుష్పాలతో ఏకాదశ(11 సార్లు)పర్యాయములు గా శ్రీ విద్యారణ్యప్రోక్త బీజమంత్ర సంపుటిత శ్రీ సూక్త పారయణము మరియు అర్చన ఈ పారాయణం లో ముఖ్యం గా సువాసినిలు పాల్గోని తద్వారా ఆర్థిక,ఋణ,మానసిక,శారీరక,మె॥బాధల నుండి విముక్తి పొందగలరు ఇట్టి పారాయణం లో భక్తులు తమ గోత్ర నామాల తో అర్చించుకొని అమ్మవారి కృపకుపాత్రులుకాగలరని -: కార్యక్రమ నిర్వహణ :- బ్రహ్మ శ్రీ నాగిళ్ళ శంకర్ శర్మగారు వంశపారంపర్య అర్చకులు బ్రహ్మశ్రీ నాగిళ్ళ షణ్ముఖ పద్మనాభ అవధాని దేవస్థాన ఆస్థాన వేదపండితులు
Comments