దసరా శరన్నవరాత్రి ఉత్సవములు 2019 (౨౦౧౯)
- Nd Sharma
- Sep 26, 2019
- 1 min read
హన్మకొండ బాలసముద్రం లో గల ప్రేస్ క్లబ్ లో శ్రీ హనుమద్గిరి పద్మాక్షి దేవస్థానమ లో 29-9-2019 ఆదివారం నుండి 9-10-2019 బుధవారం వరకు నిర్వహించబడు దేవిశరన్నవరాత్రి ఉత్సవాలు మరియు 13-10-2019 ఆదివారం సా:5:00 లకు పరమహంస పరివ్రాజకులు కాకతీయ సంస్థానాధీశులు శ్రీ శ్రీ గోవిందానంద సరస్వతి స్వామి వారి సమక్షంలో శాంతికళ్యాణ మహోత్సవాలను పత్రికాసమావేశం ద్వారా తేలియపరుస్తూ ఇట్టి ఉత్సవాల కరపత్రాలను శ్రీ హనుమద్గిరి పద్మాక్షి చారిటబుల్ ట్రస్ట్ చే ఆవిష్కరించబడినది

హన్మకొండ లో ఈనెల 29వ తారీకు నుండి పద్మాక్షి కాలనీలోని సుప్రసిద్ధ ఆలయమైన శ్రీ హనుమద్గిరి పద్మాక్షీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల ప్రారంభోత్సవ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేయాలని, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటిపారుదల శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి దంపతులను కోరిన పద్మాక్షి దేవస్థాన ఆస్థాన వంశీయ అర్చకులు,నాగిళ్ల శంకర్ శర్మ, వేదపండితులు నాగిళ్ళషణ్ముఖ పద్మనాభ అవధాని గార్లు.. మరియు దేవి నవరాత్రి ఉత్సవాల కరపత్రాలను మంత్రి చేతులమీదుగా ఆవిష్కరించారు..

Comments